Site icon NTV Telugu

ఫ్రెండ్ భార్యతో రాసలీలలు.. వద్దని వారించినా వినకపోవడంతో

వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి తరువాత కూడా ఇద్దరు స్నేహాన్ని కొనసాగించారు. పెళ్లి తరువాత భార్యకు కూడా తన స్నేహితుడిని పరిచయం చేశాడు. బాధ స్నేహితుడు అని ఆమె కూడా కలివిడిగా మాట్లాడింది. దీంతో ముగ్గురు మంచి స్నేహితులయ్యాం అని ఆ భర్త ఎంతో సంతోషించాడు. కానీ స్నేహితుడని నమ్మి ఇంటికి పిలిస్తే భార్యపైనే కన్నేశాడు దుర్మార్గుడు. చివరికి భార్య కూడా భర్తను కాదని అతడి స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీంతో తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఇరుగుపొరుగువారు అనే మాటలు తట్టుకోలేక భార్య కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని ఐదేళ్ల చిన్నారిని అనాథను చేసిన విషాద ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పిహెచ్‌ఈ కాలనీకి చెందిన గొల్లు బలన్, సాగర్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. కొన్నేళ్ల క్రితం గొల్లు బలన్ కు సుధతో వివాహమైంది .. వీరికి ఒక కుమారుడు. పెళ్లి తరువాత కూడా సాగర్ ఫ్రెండ్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.. భార్యపైనా సెటైర్లు, జోకులు వేసేవాడు. ఇవేమి భర్త పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అదే అతను చేసిన అతిపెద్ద పొరపాటు. కొద్దిరోజుల్లోనే భార్య, సాగర్ ల మధ్య స్నేహంవివాహేతర సంబంధానికి దారితీసింది. సుధ ప్రవర్తన గొల్లు బలన్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది. తనను అనుమానిస్తే సాగర్ కి చెప్తానని బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో తన భార్యను వదిలేయమని సాగర్ ని బతిమిలాడాడడు గొల్లు బలన్.. అయినా వారు మాట వినకపోవడంతో గత నెల గొల్లు బలన్, ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతరం చుట్టుపక్కల వారు తనవల్లే భర్త చనిపోయాడని అనే సూటిపోటి మాటలు భరించలేక సుధ సైతం పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని మృతిచెందింది. తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో ఐదేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. గొల్లు బలన్ తల్లి 70 ఏళ్ల వయసులో కష్టపడలేక, మనవడికి తిండిపెట్టలేక సతమతమవుతుంది. అద్దె కూడా కట్టని దయనీయ స్థితిలో ఉన్నానని, ఎవరైనా ఆదుకోవాలని ఆమె అడగడం చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. వివాహేతర సంబంధం ఇద్దరినీ రోడ్డుమీదకు లాగిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version