Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్.. వాట్సపా మజాకా..
- వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆటో దొంగ అరెస్ట్
- అల్వాల్‌లో ఆటో చోరీ బంజారాహిల్స్‌లో గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whatsapp Group: ఆటోను దొంగిలించి పారిపోయిన దొంగను.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది ఓ వాట్సప్ గ్రూప్. చోరీ చేసిన కొన్ని గంటల్లోనే దొంగ అడ్డంగా దొరికిపోయాడు. వాట్సప్ గ్రూప్‌లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఏకమై ఆటోను దక్కేలా చేశారు. ఇంతకూ ఆటో దొంగకు.. వాట్సప్ గ్రూప్‌కి ఉన్న లింక్ ఏంటి..? ఎక్కడో ఆల్వాల్‌లో ఆటో పోతే.. బంజారాహిల్స్‌లో ఎలా పట్టుబడ్డాడు. చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు తెలివిగా పట్టుకోవడం చూశాం.. లేదా సీసీ కెమెరాల సాయంతో అడ్డంగా బుక్ చేయడం చూశాం. కానీ హైదరాబాద్‌లో ఆటోను దొంగిలించిన దొంగను వాట్సప్ గ్రూప్ పట్టించింది. అది కూడా చోరీ ఐన కొద్ది గంటల్లోనే. ఆల్వాల్ చోరీ ఐన ఆటో.. బంజారాహిల్స్‌లో దొరికింది..
READ ALSO: Hyderabad: స్నేహితుడి భార్య మీద కన్నేసిన వ్యక్తి.. ఫ్రెండ్‌కి విషయం తెలియడంతో…
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
జార్ఖండ్‌కి చెందిన బిపిన్ రాజ్ యాదవ్.. బొల్లారం రిసాలబజార్‌లో నివసిస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే ఆటోతో రాత్రి ఇంటికి వచ్చిన బిపిన్.. ఇంటి ముందు ఆటోను పార్క్ చేశాడు. తెల్లారి లేచి చూసే సరికి ఆటో మాయమైంది. చుట్టుపక్కల అంతా గాలించాడు. ఎక్కడా ఆటో కనిపించలేదు. ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆటోను దుండగులు ఎత్తుకెళ్లడం గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బిపిన్. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు…
సీసీ ఫుటేజ్‌ను కలెక్ట్ చేసుకున్న బిపిన్… తమ జార్ఖండ్ వాసులంతా క్రియేట్ చేసుకున్న జార్ఖండ్ ఏక్ తా సమాజ్ గ్రూప్‌లో ఆ వీడియో పోస్ట్ చేశాడు. తన ఆటో పోయిందని.. ఆటో నెంబర్, ఆటో ఫొటోలతోపాటు.. సీసీ ఫుటేజ్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. గ్రూప్‌లో ఉన్న దీపక్ కుమార్.. తాను ఉన్న మరికొన్ని వాట్సప్ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేశాడు. విషయం తెలుసుకున్న వాళ్లంతా.. నిఘా పెట్టారు. ఇదే క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లోని స్టార్ హాస్పిటల్ వద్ద డ్రాపింగ్‌కి వచ్చిన ఆటో డ్రైవర్.. బిపిన్ ఆటోను గుర్తించాడు. గ్రూప్‌లో ఉన్న ఫొటోలతో మ్యాచ్ చేసి చూశాడు. ఇది బిపిన్ ఆటో అని నిర్ధారించుకుని.. దీపక్ కుమార్‌కి కాల్ చేసి చెప్పాడు. ఆటో రోడ్ నెంబర్ 10లో ఉందని గ్రూప్‌లో పోస్ట్ చేశాడు కల్లుకుమార్. విషయాన్ని బిపిన్‌కి చెప్పాడు దీపక్ కుమార్…
బిపిన్ ఆటోకు ఉన్న స్టిక్కర్లను ఓ వ్యక్తి తొలగిస్తుండటాన్ని గమనించాడు కల్లుకుమార్. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఈ ఆటో ఎవరిదని ప్రశ్నించాడు. ఆటో తనదే అని.. స్టిక్కర్ పాతదైపోయింది.. అందుకే తొలగిస్తున్నాను అంటూ బుకాయంచసాగాడు. అక్కడికి చేరుకున్న మరికొందరి సహాయంతో ఆటో స్టిక్కర్లు తొలగిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆటోను దొంగిలించింది అతడే అని సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించుకున్నారు. ఆటోను చోరీ చేసింది జీడిమెట్లకు చెందిన రోహిత్‌గా గుర్తించి.. బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు ఆటో డ్రైవర్లు..
రోహిత్‌ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఆల్వాల్ పోలీసులకు అప్పగించారు. రోహిత్‌పై చోరీ కేసు నమోదు చేశారు. ఆటోను గుర్తించి సమాచారం ఇచ్చిన కల్లుకుమార్‌ను పోలీసులు అభినందించారు. ఫార్వర్డ్ మెసేజ్‌లే కదా అని లైట్ తీసుకోకుండా.. విషయాన్ని చదవడం వల్లే ఆటోను గుర్తించగలిగాను అని చెప్పాడు కల్లుకుమార్. స్టిక్కర్లు తొలగించి.. నెంబర్ ప్లేట్‌ను మార్చి ఉంటే.. ఆటో దొంగను పట్టుకోవడం కష్టతరమయ్యేది..
READ ALSO: Siachen Tragedy: సియాచిన్‌లో విషాదం.. ఆర్మీ అధికారులను బలిగొన్న మంచు
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!