Site icon NTV Telugu

Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్‌ గ్రూప్‌.. వాట్సపా మజాకా..

Whatsapp Group

Whatsapp Group

Whatsapp Group: ఆటోను దొంగిలించి పారిపోయిన దొంగను.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించింది ఓ వాట్సప్‌ గ్రూప్‌. చోరీ చేసిన కొన్ని గంటల్లోనే దొంగ అడ్డంగా దొరికిపోయాడు. వాట్సప్‌ గ్రూప్‌‌లో ఉన్న ఫ్రెండ్స్‌ అంతా ఏకమై ఆటోను దక్కేలా చేశారు. ఇంతకూ ఆటో దొంగకు.. వాట్సప్‌ గ్రూప్‌కి ఉన్న లింక్‌ ఏంటి..? ఎక్కడో ఆల్వాల్‌లో ఆటో పోతే.. బంజారాహిల్స్‌లో ఎలా పట్టుబడ్డాడు. చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు తెలివిగా పట్టుకోవడం చూశాం.. లేదా సీసీ కెమెరాల సాయంతో అడ్డంగా బుక్‌ చేయడం చూశాం. కానీ హైదరాబాద్‌లో ఆటోను దొంగిలించిన దొంగను వాట్సప్‌ గ్రూప్‌ పట్టించింది. అది కూడా చోరీ ఐన కొద్ది గంటల్లోనే. ఆల్వాల్‌ చోరీ ఐన ఆటో.. బంజారాహిల్స్‌‌లో దొరికింది..

READ ALSO: Hyderabad: స్నేహితుడి భార్య మీద కన్నేసిన వ్యక్తి.. ఫ్రెండ్‌కి విషయం తెలియడంతో…

జార్ఖండ్‌‌కి చెందిన బిపిన్‌ రాజ్‌ యాదవ్‌.. బొల్లారం రిసాలబజార్‌లో నివసిస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే ఆటోతో రాత్రి ఇంటికి వచ్చిన బిపిన్‌.. ఇంటి ముందు ఆటోను పార్క్‌ చేశాడు. తెల్లారి లేచి చూసే సరికి ఆటో మాయమైంది. చుట్టుపక్కల అంతా గాలించాడు. ఎక్కడా ఆటో కనిపించలేదు. ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆటోను దుండగులు ఎత్తుకెళ్లడం గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బిపిన్‌. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు…

సీసీ ఫుటేజ్‌ను కలెక్ట్‌ చేసుకున్న బిపిన్‌… తమ జార్ఖండ్‌ వాసులంతా క్రియేట్‌ చేసుకున్న జార్ఖండ్‌ ఏక్‌ తా సమాజ్‌ గ్రూప్‌లో ఆ వీడియో పోస్ట్‌ చేశాడు. తన ఆటో పోయిందని.. ఆటో నెంబర్‌, ఆటో ఫొటోలతోపాటు.. సీసీ ఫుటేజ్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. గ్రూప్‌లో ఉన్న దీపక్‌ కుమార్‌.. తాను ఉన్న మరికొన్ని వాట్సప్‌ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్‌ చేశాడు. విషయం తెలుసుకున్న వాళ్లంతా.. నిఘా పెట్టారు. ఇదే క్రమంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10 లోని స్టార్‌ హాస్పిటల్‌ వద్ద డ్రాపింగ్‌‌కి వచ్చిన ఆటో డ్రైవర్‌.. బిపిన్‌ ఆటోను గుర్తించాడు. గ్రూప్‌లో ఉన్న ఫొటోలతో మ్యాచ్‌ చేసి చూశాడు. ఇది బిపిన్‌ ఆటో అని నిర్ధారించుకుని.. దీపక్‌ కుమార్‌‌కి కాల్‌ చేసి చెప్పాడు. ఆటో రోడ్‌ నెంబర్‌ 10లో ఉందని గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు కల్లుకుమార్‌. విషయాన్ని బిపిన్‌‌కి చెప్పాడు దీపక్‌ కుమార్‌…

బిపిన్‌ ఆటోకు ఉన్న స్టిక్కర్లను ఓ వ్యక్తి తొలగిస్తుండటాన్ని గమనించాడు కల్లుకుమార్‌. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఈ ఆటో ఎవరిదని ప్రశ్నించాడు. ఆటో తనదే అని.. స్టిక్కర్‌ పాతదైపోయింది.. అందుకే తొలగిస్తున్నాను అంటూ బుకాయంచసాగాడు. అక్కడికి చేరుకున్న మరికొందరి సహాయంతో ఆటో స్టిక్కర్లు తొలగిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆటోను దొంగిలించింది అతడే అని సీసీ ఫుటేజ్‌ ద్వారా నిర్ధారించుకున్నారు. ఆటోను చోరీ చేసింది జీడిమెట్లకు చెందిన రోహిత్‌‌గా గుర్తించి.. బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు ఆటో డ్రైవర్లు..

రోహిత్‌ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు.. ఆల్వాల్‌ పోలీసులకు అప్పగించారు. రోహిత్‌పై చోరీ కేసు నమోదు చేశారు. ఆటోను గుర్తించి సమాచారం ఇచ్చిన కల్లుకుమార్‌ను పోలీసులు అభినందించారు. ఫార్వర్డ్‌ మెసేజ్‌లే కదా అని లైట్‌ తీసుకోకుండా.. విషయాన్ని చదవడం వల్లే ఆటోను గుర్తించగలిగాను అని చెప్పాడు కల్లుకుమార్‌. స్టిక్కర్లు తొలగించి.. నెంబర్‌ ప్లేట్‌ను మార్చి ఉంటే.. ఆటో దొంగను పట్టుకోవడం కష్టతరమయ్యేది..

READ ALSO: Siachen Tragedy: సియాచిన్‌లో విషాదం.. ఆర్మీ అధికారులను బలిగొన్న మంచు

Exit mobile version