Site icon NTV Telugu

కృష్ణా జిల్లాలో దారుణం.. వాచ్‌మెన్‌ను చంపి మద్యం చోరీ..

కృష్ణ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జి.కొండూరు మండలం వెలగలేరులోని ప్రభుత్వ మద్యం దుకాణ వాచ్‌మెన్‌ సాంబయ్యను గుర్తు తెలియని దుండగలు గత రాత్రి హత్య చేశారు. అంతేకాకుండా హత్య అనంతరం మద్యం బాటిళ్లతో పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మద్యానికి బానిసైన వారే ఈ హత్యకు పాల్పడిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాంబయ్య మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version