Site icon NTV Telugu

Vikarabad: వీఆర్వో పాడుబుద్ధి.. భార్యకు పిల్లలు పుట్టడం లేదని..

Vro Cheated Girlfriend

Vro Cheated Girlfriend

అతడో వీఆర్వో. బాధ్యతగా మెలగాల్సిన అతడు పాడుబుద్ధి చూపించాడు. అప్పటికే పెళ్లైన అతగాడు.. భార్యకు సంతానం కలగడం లేదని ఓ యువతికి రెండో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం మొహం చాటేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పెద్దేముల్‌ మండలంలో బోయ కార్తీక్‌ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను బషీరాబాద్ మండలం దామర్‌చేడ్‌ గ్రామానికి చెందినవాడు. ఇతనికి ఇంతకుముందే పెళ్లయ్యింది. అయితే, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని ఓ యువతికి మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.

పిల్లలు లేరని కార్తీక్ నిత్యం బాధపడటం చూసి, ఆ యువతి కరిగిపోయింది. అతని ప్రేమలో పడి, సర్వస్వం సమర్పించుకుంది. పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. కానీ, ఇంతలోనే అతడు ప్లేటు తిప్పేసింది. ఇటీవల భార్యకు సంతానం కలగడంతో.. సదరు యువతితో మాట్లాడటం మానేశాడు. పెళ్లి గురించి ప్రస్తావిస్తే, పెళ్లి చేసుకునేదే లేదని తేల్చి చెప్పాడు. చాలాసార్లు ప్రాధేయపడినా, అతడు వినిపించుకోలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. కార్తీక్, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కార్తీక్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

Exit mobile version