Vizag Crime: దువ్వాడ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. ఇక, భీమిలి హత్య కేసులో సంచలన అంశాలు..!
- విశాఖలో కలకలం రేపిన రెండు కేసులను ఛేదించిన పోలీసులు..
- దువ్వాడ జంట హత్యల కేసులో నిందితుడి అరెస్ట్..
- దాకమర్రి వివాహిత హత్య కేసులో క్రాంతి కుమార్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖలో కలకలం రేపిన దువ్వాడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు.. దువ్వాడ పీఎస్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు.. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని గుర్తించారు.. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా.. హత్యకుగురైన లక్ష్మీతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు తెలిపారు పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి విస్తు పోయే నిజాలు వెల్లడించారు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి..
Read Also: Ivana : శ్రీ విష్ణు తెలుగు చాలా స్పీడ్.. అర్థమయ్యేది కాదు.. అలవాటైపోయా!
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
ఈ కేసులో అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడిగా గుర్తించాం అన్నారు సీపీ శంఖబ్రత బాగ్చి.. హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు… నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం.. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉండేది.. అయితే, కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందడంతో.. అనంతరం లక్ష్మితో సన్నిహితంగా మెలిగాడు మిశ్రా.. నిందితుడు ఒడిశా రాష్ట్రం పూరీకి చెందినవాడిగా గుర్తించారు.. 2012లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మిశ్రా.. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి.. ఇండియాకు తిరిగి వచ్చాడు.. అయితే, అప్పులు పెరిగిపోవడంతో.. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చటానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు నిందితుడు.. లక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు.. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకున్నాడని.. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని.. ఈ కేసు ఛేదించటానికి 10 బృందాలు నియమించినట్టు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు..
Read Also: Nani: నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లోనాని సంచలనం
మరోవైపు, భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును కూడా పోలీసులు ఛేదించారు.. హత్య చేసిన క్రాంతి కుమార్ ను అరెస్టు చేశారు.. మొత్తం 6 బృందాలుగా ఏర్పడి కేసును కొలిక్కి తీసుకొచ్చారు.. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. మృతురాలు వెంకటలక్ష్మి కి క్రాంతి కూమార్ కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలిందన్నారు.. క్రాంతి కూమర్ కు అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు.. క్రాంతి కూమార్ రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండే వాడు.. కాంత్రికూమార్ కు మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది… క్రాంతి కూమార్ మృతురాలు వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడడంతో రెండో భార్యతో వెంకటలక్ష్మికి గొడవలు జరిగాయి.. ఈ నేపథ్యంలో రెండో భార్యను వేరే బ్లాక్ కు మార్చాడు.. అయినా వెంకటలక్ష్మి తో వివాహేతర సంబంధం కొనసాగించాడు .. ఈ విషయంలో మొదటి భార్య రెండో భార్యతో తరచు గొడవలు జరిగాయి.. మరో వైపు వెంకటలక్ష్మి తనతోనే ఎక్కువ సేపు గడపలని.. తనతోనే ఉండాలని ఒత్తిడి తీసుకొచ్చింది.. దీనితో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు.. వెంకటలక్ష్మిని బయటకు వెళ్లదామని తీసుకెళ్లాడు.. ఐస్ క్రీమ్ తిని బండిలో పెట్రోల్ కొట్టించాడు.. తర్వాత బాటిల్లో పెట్రోల్ తీసుకున్నాడు.. తనను చంపేందుకు పెట్రోల్ కొట్టించి తన చేతికే ఇచ్చాడు .. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానని చెప్పాడు.. ఇక, శారీరకంగా కలుద్దామని దాకమర్రి లేవుట్ కి తీసుకెళ్లి కత్తితో గొంతు కోశాడు.. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకున్నాడు.. తర్వాత పెట్రోల్ పోసి తగలు పెట్టాడని వెల్లడించారు సీపీ..
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!