S*exually Assaulted: బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్ల బాలికపై లైంగిక దాడి..

  • విశాఖలోని న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
  • బిస్కెట్లు ఇప్పిస్తానని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి..
  • నిందితుడిపై న్యూ పోర్టు పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు..
Vsp

Vsp

S*exually Assaulted: విశాఖపట్నంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికంగా నివసించే ఎరిపిల్లి యోగి అలియాస్ గాంధీ అనే వ్యక్తి, చిన్నారికి బిస్కెట్లు, తినుబండారాలు కొని పెడతానని చెప్పి తీసుకెళ్లి దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Read Also: PM Modi: ఏఐ సమ్మిట్ దక్షిణాసియాకే గర్వకారణం

అయితే, చిన్నారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె తీవ్రంగా ఏడవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రక్తస్రావం గమనించిన తల్లి వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందజేసింది. స్థానికుల సహకారంతో నిందితుడిపై న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, బాలికను కేజీహెచ్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.