Site icon NTV Telugu

Visakhapatnam gun firing: సాగర తీరంలో కాల్పుల కలకలం..

09

09

Visakhapatnam gun firing: విశాఖ తీరం.. అర్ధరాత్రి సమయంలో తుపాకీ పేలుడు శబ్దాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత నగరంలో నాటు తుపాకీల కలకలం రేపాయి. దొంగ, పోలీసు కలిసిపోయి జరిపిన ఈ నాటు తుపాకీ గందరగోళంలో పోలీసులపై మరో మచ్చ పడింది. ప్రశాంతంగా ఉండే విశాఖ తీరంలో ఏదో ఒక అలజడి నిత్యం చెలరేగుతూ ప్రజలకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది.

READ MORE: Killer Wife: ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చేందుకు భార్య కుట్ర.. చివరకు

ఈ ఆసుపత్రి బెడ్ మీద వ్యక్తి పేరు రాజేష్. ఇతనిపైనే దుండగులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బుల్లెట్ గాయాలకు చికిత్స తీసుకుంటున్నాడు. విశాఖలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు రాజేష్. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నూకరాజు అలియాస్ మణికంఠ అనే వ్యక్తి నాటు తుపాకీతో రాజేష్‌పై దాడికి దిగాడు. నాటు తుపాకీతో కాల్చడంతో రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రాజేష్‌ను కొంతమంది స్థానికులు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేష్ వద్ద పూర్తి వివరాలను తీసుకున్నారు. విషయం తెలిసిన తర్వాత పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది.

మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాయుడు ఈ కాల్పుల వెనుక కింగ్ పిన్‌గా ఉన్నాడని తెలుస్తోంది. నిందితుడు నూకరాజు అలియాస్ మణికంఠకు సుపారీ ఇచ్చి రాజేష్‌ను హతమార్చమన్నాడనే సంచలన విషయం బయటపడింది. అసలు ఒక పోలీస్ కానిస్టేబుల్.. దొంగతో చేతులు కలిపి హత్య చేయించడం ఏంటీ అనే కోణంలో దర్యాప్తు చేయగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

విశాఖపట్నం పోర్టులో భారీ మొత్తంలో ఉన్న బొగ్గును పక్కదారి పట్టించి దొంగతనంగా అమ్మకాలు జరుపుతున్న గ్యాంగ్‌తో కానిస్టేబుల్ నాయుడుకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ముఠాలో ఒకడిగా మారిపోయిన నాయుడుకి రాజేష్‌కు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తగాదాలు భారీ ఎత్తున పెరిగిపోవడంతో నాయుడు రాజేష్‌ను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే నూకరాజుకు సుపారీ ఇచ్చి ఘాతుకానికి ఓడి కట్టాడు.

నాటు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై చర్చ
ఐతే వారు ఇద్దరూ నాటు తుపాకీ ఎక్కడి నుంచి సంపాదించారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేరానికి పాల్పడిన తర్వాత.. నింతులిద్దరూ పరారీలో ఉన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు, కొంతమంది ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు దర్యాప్తు వేగవంతం చేశామంటున్నారు.

READ MORE: Airtel: యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్.. ఆ చౌకైన ప్లాన్ తొలగింపు!

Exit mobile version