Woman Murderd at Vijayawada: రాన్రానూ మనుషులలో క్రూరత్వం పెరిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాట్లాడి తేల్చుకునే విషయంలో కూడా పట్టుదలకి పోయి చంపుకునే దాకా వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో ఒక దారుణ హత్య జరిగింది. విజయవాడ శివారులోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ పై ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపై ఒక దుండగుడు ఓ మహిళను వెంటాడి కత్తితో నరికి చంపి పరారయ్యాడని సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇక పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం పిల్లనిచ్చిన అత్తని అల్లుడు చంపేశాడు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ మీద దారి కాచి రాజేష్ అనే వ్యక్తి తన అత్త నాగమణిని నరికి చంపాడు.
Mahesh Babu: కొత్త కారు కొన్న మహేష్ బాబు.. హైదరాబాద్లో ఇదే మొదటి మోడల్?
అల్లుడి కత్తి వేట్లకు అక్కడిక్కడే అత్త నాగమణి మృతి చెందింది. మృతురాలు నాగమణి కూతురుకు ,అల్లుడు రాజేష్ కు మద్య కొంతకాలంగా విభేదాలు ఏర్పడి దూరంగా ఉంటున్నారు. ఇక కలిసి ఉండడం కష్టం అని భావించి విడాకులకు ఇరువర్గాల వారు అప్లై చేసుకున్నారు. ఇక భార్యను తన అత్త రెచ్చగొడుతుందని విడాకుల వ్యవహారానికి కుడా ఆమె కారణం అని భావించి నాగమణిని హత్య చేశాడు అల్లుడు రాజేష్. ఇక ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న కొత్తపేట పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే విజయవాడలో నడిరోడ్డు మీద అది కూడా అందరూ చూస్తూ ఉండగా ఇలా హత్యకు తెగబడటం చర్చనీయాంశం అవుతోంది.
