పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం కామన్.. కొన్నిసార్లు చిన్నగా మొదలైన గొడవలు సైతం రక్తపాతాన్ని సృష్టించిన ఘటనలు కొన్ని ఉంటాయి.. తాజాగా యూపీలో ఓ పెళ్లి వేడుకలో రసగుల్లా కోసం దారుణమైన గొడవ జరిగింది..విందులో ఈ స్వీట్ వడ్డించలేదని అతిథులు నానాహంగామా చేశారు. చినిగి చినిగి చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితికి వచ్చారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి… ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు..
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుక జరిగింది. బ్రిజ్‌బన్ కుష్వాహాలో జరిగిన పెళ్లి వేడుకలో భోజనాలు జరుగుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిధులంతా కడుపారా తిని వధువరులను ఆశీర్వదించి వెళ్తున్నారు. ఇంతలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చి రసగుల్లాలు అయిపోయాయి అని గట్టిగా అరిచాడు.. దీంతో గొడవ ప్రారంభమైంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్షత గాత్రులను ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘటన జరగడానికి కారణం అయిన వారిని అదుపులోకి తీసుకున్నారు..
ఇక ఇలాంటి ఘటనే అక్టోబరు 2022లో కూడా జరిగింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లోని ఒక వివాహ వేడుకలో స్వీట్ల కొరత ఏర్పడటంతో సంఘర్షణ జరిగింది. అక్కడ జరిగిన గొడవలో ఒక వ్యక్తి చనిపోయాడు కూడా.. ఇలా తరచుగా జరుగుతూనే ఉంటాయి..