NTV Telugu Site icon

Crime: కూతురి లవ్ ఎఫైర్.. హత్య కోసం వ్యక్తికి సుపారీ ఇచ్చిన తల్లి.. ట్విస్ట్ ఏంటంటే తల్లినే చంపేశాడు..

Crime

Crime

Crime: 17 ఏళ్ల కూతురు లవ్ ఎఫైర్, శృంగార సంబంధం గురించి తెలిసిన తల్లి, తన కూతురిని హతమార్చేందుకు ఓ కిరాయి హంతకుడిని నియమించుకుంది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సదరు హంతకుడికి సుపారీ ఇచ్చిన 42 ఏళ్ల మహిళనే అతను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. నిజానికి తల్లి నియమించిన వ్యక్తే, ఇక్కడ ఆమె కూతురు లవర్‌ అని తేలింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలో జరిగింది. ఆల్కా అనే మహిళని అక్టోబర్ 06న పొలంలో గొంతు కోసి చంపేశాడు. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో అల్కా భర్త రమాకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read Also: Rajnath Singh: అలసత్వం వద్దు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముంది..

పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తెకు వేరే వ్యక్తితో ఉన్న సంబంధం గురించి అల్కా తీవ్రంగా కలత చెందింది. దీంతో కుమార్తెను ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసింది. అత్యాచారం కేసులో శిక్ష అనుభవించి ఇటీవల జైలు నుంచి వచ్చిన సుభాష్ అనే వ్యక్తిని తన కుమార్తెను హత్య చేయాలని సంప్రదించింది. తన కూతురిని చంపేందుకు రూ. 50 వేలతో డీల్ కుదుర్చుకుంది. అప్పటికే సుభాష్‌కి అల్కా కూతురికి మధ్య ఉన్న సంబంధం గురించి అల్కాకి తెలియదు.

అల్కా ప్లాన్ గురించి తెలుసుకున్న సుభాష్ ఆమె కూతురుకి సమాచారం ఇచ్చాడు. కూతురు, సుభాష్‌ని పెళ్లి చేసుకునేందుకు తన తల్లిని చంపేయాలని ఒప్పించింది. ఇద్దరు కలిసి అల్కాని చంపేందుకు ప్లాన్ చేశారు. సుభాష్ ముందుగా అల్కాను చంపినట్లు నాటకమాడి, ఒప్పందం కుదర్చుకున్నట్లు అల్కాని మిగిలిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇద్దరు ఆగ్రాలో కలుసుకున్నారు. అక్కడ తన కుమార్తెను సుభాష్ చంపలేదనే విషయం అల్కాకి తెలిసింది. దీని తర్వాత హంతకుడు, అల్కా, ఆమె కుమార్తె కలిసి ఎలాహ్‌కి బయలుదేరారు. ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు కలిసి అల్కాని హత్య చేసి పొలంలో పారేశారు. ప్రస్తుతం అల్కా కుమార్తెని, హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Show comments