NTV Telugu Site icon

Uttar Pradesh: బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో హిందూ సంస్థలు, విశ్వహిందూ పరిషత్ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ తీసుకుంది. మంగళవారం ఫతేపూర్ లోని నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేశారు.

Read Also: Mamata Benerjee: మమతా బెనర్జీకి తప్పిన ప్రమాదం.. ఉత్తర బెంగాల్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

జూన్ 22న ఫతేపూర్‌లోని ఒక గ్రామంలో జరిగిన వివాహానికి 17 ఏళ్ల బాలిక, ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో పెళ్లి మండపం నుంచి బాలిక కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి తెలిపారు. అమె బంధువులు, కుటుంబసభ్యులు గంటల తరబడి వెతికినా.. బాలిక కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు పెళ్లి వేదిక సమీపంలో బాలిక తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా బాలిక మరణించింది.

నిందితుడిని ఇంటిని బుల్డోజర్ తో కూల్చేయాలని యువతి తరుపు బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది లవ్ జీహాద్ అని వీహెచ్పీ నేతలు ఆరోపించారు. హిందువుగా నటిస్తూ నిందితుడు బాలికను ట్రాప్ చేశాడని, ఆ తరువాత అత్యాచారం చేశాడని ఆరోపించారు.

Show comments