NTV Telugu Site icon

UP Crime: మరదలిపై గ్యాంగ్ రేప్, హత్య కోసం రూ.40,000 అప్పు.. సంచలనంగా యూపీ కేసు..

Up Crime

Up Crime

UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో మీరట్‌ గ్యాంగ్ రేప్, హత్య ఘటన సంచలనంగా మారింది. ఒక వ్యక్తి తన మరదలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు దారుణంగా హత్య చేశాడు. దీని కోసం ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లని నియమించుకున్నాడు. వీరంతా కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, గొంతుకు నులిమి, కాల్చి చంపారు. అయితే, ఈ హత్యకు ప్రధాన నిందితుడు రూ. 40,000 వేలు అప్పు చేసి ఇద్దరు నిందితులను నియమించుకున్నాడని పోలీస్ విచారణలో తేలింది. ఈ కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Read Also: Botsa Satyanarayana : బడ్జెట్ ఆనందం, ఆశ్చర్యకరమైంది.. బడ్జెట్ పై బొత్స వ్యాఖ్యలు

ఈ సంఘటన జనవరి 21న మీరట్‌లోని నాను కాలువ సమీపంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ప్రధాన నిందితుడిని ఆశిష్‌గా గుర్తించారు. అతడికి తన భార్య చెల్లెలితో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేస్తుందని హత్యకు పథకం రచించినట్లు నిందితుడు చెప్పాడు. ఆశిష్ ఆస్పత్రిలో పనిచేసే శుభం, మరో నిందితుడు దీపక్‌ అనే ఇద్దరి సాయాన్ని కోరాడు.

ఆమెని చంపడానికి వీరు రూ. 30,000లతో డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా ముందు రూ. 10,000గా ఇచ్చి, హత్య తర్వాత మిగతా రూ. 20,000 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని కోసం ఆశిష్ రూ. 40,000 అప్పు చేసినట్లు విచారణలో తేలింది. ఆశిష్, శుభం, దీపక్ బాధిత మహిళను స్కూటర్‌పై కాలువ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత స్కార్ఫ్ సాయంతో ఆమె గొంతును బిగించి హత్య చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితురాలి కుటుంబం జనవరి 23 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు అందడంతో, విచారణ చేపట్టిన పోలీసులు ఈ దారుణాన్ని వెలికితీశారు.