UP News: ఆహారంలో ఉప్పు ఎక్కువైందని ఓ వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా వ్యవహరించాడు. భార్య 5 నెలల గర్భిణి అని చూడకుండా దాడి చేశాడు. దీంతో ఆమె ఇంటి పైకప్పు నుంచి కిందపడి చనిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలోని నాగ్డా ధాక్ గ్రామంలో జరిగింది. బుధవారం సాయంత్రం, మృతురాలు వండి ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉందనే కారణంగా గొడవజరిగింది. ఈ గొడవ కారణంగా బ్రజ్‌బాలా(25) తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Pak Social Media Accounts: పాక్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేత..? ప్రభుత్వం క్లారిటీ..!
రాము అనే వ్యక్తి భార్య బ్రజ్‌బాలాపై దాడి చేసిన తర్వాత, ఆమె పైకప్పు నుంచి కింద పడింది. ఆ తర్వాత ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను అలీఘర్ మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. బ్రజ్ బాలా మరణం తర్వాత ఆమె సోదరుడు మాట్లాడుతూ.. రాము తన వదినతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడని, దీనిని బ్రజ్‌బాలా వ్యతిరేకించిందని చెప్పాడు.
ఈ కారణాల వల్లే తరుచూ వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవని తెలుస్తోంది. సంఘటన తర్వాత నిందితుడు రాము అక్కడ నుంచి పారిపోయాడు. గ్రామం చివర్లో ఉన్న ఒక ఇంటిలో గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
