NTV Telugu Site icon

Cyber Harassment: ఆన్‌లైన్‌లో బ్లాక్ చేసినందుకు ఆ వెబ్‌సైట్‌లో ఫోటోలు అప్‌లోడ్.. ఇలా పట్టేశారు!

Online Harassment

Online Harassment

UP Man Arrested for Harassing Hyderabad woman: సోషల్ మీడియాలో మహిళల మీద వేధింపులు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు అమ్మాయిలు వెళుతుంటే రోడ్డు మీద, బస్టాండ్ దగ్గర, స్కూల్స్​, కాలేజీలలో ​టీజింగ్ ​చేసేవారు. కానీ మహిళల రక్షణ చర్యల్లో భాగంగా వారిపై జరుగుతున్న వేధింపులు అరికట్టేందుకు షీటీమ్స్​ సహా అనేక రకాల టీములను ఏర్పాటు చేయడంతో అవి కొంత వరకు తగ్గు ముఖం పట్టాయి. కానీ ఇప్పుడు ఈవ్ ​టీజర్లు రూట్ ​మార్చి ఆన్​లైన్​లో, సోషల్ ​మీడియా వేదికగా వేధింపులకు దిగుతున్నారు. కరోనా లాక్​డౌన్​ తర్వాత యువతులు అంతా బయట కంటే ఆన్​లైన్​లోనే ఉంటుండడంతో ఆన్ లైన్ ఈవ్ ​టీజింగ్​ బాగా పెరిగింది. ఇక ఇదే క్రమంలో హైదరాబాద్ యువతిని దారుణంగా వేధించిన యూపీకి చెందిన యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన ప్రతాప్ మెహతాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
OTT Releases: సినీ లవర్స్ కి పండగే.. ‘మళ్లీ పెళ్లి’ సహా ఒకే రోజు ఏకంగా 28 సినిమాలు
నగరానికి చెందిన ఒక యువతిని ఆన్ లైన్ వేదికగా చిత్ర హింసలకు గురి చేశాడు ప్రతాప్ మెహతా. ఇంస్టాగ్రామ్ లో పరిచయమై ప్రేమ, పెళ్లి పేరుతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు, ముందుగా మంచిగా మెలగడంతో ఫోన్ నెంబర్ కూడా షేర్ చేసింది సదరు యువతి. అయితే ప్రేమ, పెళ్లి అంటూ మొదలు పెట్టడంతో ప్రతాప్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది యువతి, దీంతో రెచ్చిపోయిన యువకుడు యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సెక్స్ వెబ్సైట్లో పోస్టింగ్ చేశాడు. అంతే కాక అక్కడితో ఆగకుండా యువతి కుటుంబ సభ్యులకు మార్పెడ్ ఫోటోలు పోస్ట్ చేసి వేధింపులకు దిగాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతాప్ ని అరెస్ట్ చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.