UP Crime: ముంబైకి చెందిన ఓ మహిళ ఆరోగ్యం కోసం భూతవైద్యుడిని సంప్రదిస్తే, అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్‌లో జరిగింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మహ్మద్ అష్రఫ్(50)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బాధిత మహిళకు భూతవైద్యం చేస్తున్నాననే నెపంతో గెస్ట్‌హౌజ్‌లో బంధించాడు.
బాధిత మహిళ చాలా సేపటి నుంచి లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు గెస్ట్ హౌజ్ లోని గదిలోకి బలవంతంగా ప్రవేశించి చూడగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ ఫిర్యాదుతో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Crime News: మైనర్ బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితుడు
మహారాష్ట్ర నుంచి వచ్చిన కుటుంబం బాస్ఖారీ పరిధిలోని కిచ్చౌచాలోని గెస్ట్ హౌజుకు వచ్చినట్లు స్టేషన్ ఆఫీసర్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడి నుంచి ఆధ్యాత్మిక సాయం కోరుతూ ఒక వ్యక్తి, అతని తల్లి, భార్యలు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గెస్ట్ హౌజ్ చేసుకున్న తర్వాత సయ్యద్ మహ్మద్ అష్రఫ్ అనే నిందితుడు ఉద్దేశపూర్వకంగా వ్యక్తి భార్య కోసం ‘దువా-తవీజ్’ చేస్తానని ప్రతిపాదించాడు. ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాడు. ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు వారిని గెస్ట్ హౌజ్‌కి తీసుకెళ్లినట్లు బాధిత మహిళ భర్త ఫిర్యాదులో నమోదు చేశారు.
కుటుంబం సమక్షంలో ప్రార్థనలు నిర్వహించడానికి బదులుగా, నిందితుడు అష్రఫ్ వారిని బయట ఉండమని, మహిళను గదిలోకి తీసుకెళ్లాడు. చాలా గంటల తర్వాత కూడా మహిళ బయటకు రాలేకపోవడంతో తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. బలవంతంగా తలుపు తెరచి చూస్తే మహిళ బలవంతానికి గురైన స్థితిలో కనిపించింది.
