Site icon NTV Telugu

UP News: భార్య ముక్కు కోసేసిన భర్త.. కారణం ఏంటంటే..?

Up News

Up News

UP News: ఉత్తర్ ప్రదేశ్ హర్దోయ్‌లో దారుణం జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తా అని పట్టుబట్టడంతో ఓ భర్త, భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి, తన భార్య ముక్కుని కోసేశాడు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటన జరిగిన తర్వాత ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోలని ట్రామా సెంటర్‌కి తరలించారు. ఒక వీడియోలో బాధితురాలు మాట్లాడుతూ.. భర్త తన ముక్కుని కోసేసిట్లు ఆరోపించింది. తనకు బతకడం ఇష్టం లేదని ఆమె చెప్పింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Read Also: Italy: విలాసవంతమైన నౌక మునక.. ప్రముఖ వ్యాపారవేత్త గల్లంతు

వివరాల ప్రకారం.. నిందితుడిని బనియాని పూర్వ నివాసి రాహుల్‌గా గుర్తించారు. అతని భార్య అనిత రక్షాబంధన్ కోసం తన తల్లిగారి ఊరు బెహటగోకు వెళ్లాలనుకుంది. ఈ విషయంపై భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త భార్య ముక్కుని కోసేశాడు. కేకక విన్న అత్తగారు, రక్తపుమడుగులో పడి ఉన్న అనితని హర్దోయ్‌ మెడికల్ కాలేజీలో చేర్చారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం లక్నో ట్రామా సెంటర్‌కి తరలించారు.

గాయపడిన మహిళ వీడియో వైరల్ కావడంతో హార్డోయ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల వారి కథనం ప్రకారం, భార్యభర్తలు ఇద్దరూ తరుచూ గొడవపడే వారని తెలిపారు. ఇటీవల గొడవపడి అనిత తన పుట్టింటికి వెళ్లి, నాలుగు రోజుల క్రిత్మే తిరిగి వచ్చిదని తెలుస్తోంది. ఇంతలో రక్షాబంధన్ రావడంతో మరోసారి అమ్మగారి ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది.

Exit mobile version