ఎన్ని చట్టాలు వచ్చినా.. కొంతమంది వ్యక్తుల ఆకతాయి తనం పోవడం లేదు. లేటెస్ట్ టెక్నాలజీని వారు దుర్వినియోగం చేస్తున్నారు. మహిళలపట్ల వారి అనుచిత వైఖరి విమర్శల పాలవుతోంది. ఒంటరిగా మహిళ దొరికితే ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని కొంతమంది యువకులు ప్రయత్నిస్తున్నారు. లొంగితే ఓకే.. లేకుంటే బెదిరింపులు.. వీడియోలు… ఇలా వుంది వారి వ్యవహారశైలి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ మహిళపట్ల అనుచితంగా ప్రవర్తించారు ఇద్దరు యువకులు. ఆ మహిళ స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడిన ఇద్దరి పై పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు పోలీసులు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన వితంతువు తన పిల్లలతో కలిసి పుట్టింటి వద్దే ఉంటుంది. గత ఏడాది జూన్ 27 రాత్రి ఆమె స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన జాన్ వెస్లీ సెల్ ఫోన్తో ఫొటోలు వీడియోలు తీస్తుండగా ఆమె గమనించింది. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో అతడు పరారయ్యాడు. తరువాత పెద్దలు అతన్ని పిలిపించి మందలించారు. వార్నింగ్ ఇచ్చారు. అతని సెల్ ఫోన్ లో వున్న ఆ మహిళల ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించి పంపించేశారు. తరువాత అతను వేరే ప్రాంతానికి వెళ్లి పోయాడు. అక్కడితో కథ అయిపోలేదు.
ఈ నెల 9వ తారీఖున జాన్ వెస్లీ స్నేహితుడు జార్జి ఆమెను కలిశాడు. నీకు సంబంధించిన అప్పటి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని,తన కోరిక తీర్చడంతో పాటు ,3లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే కాకుండా చంపుతానని బెదిరించాడు. ఈ వ్యవహారాన్ని ఉండి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీనిపై జార్జి,జాన్ వెస్లీ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఉండి పోలీసులు.
Read Also: Team India: వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ
