Site icon NTV Telugu

Truck Loses Control: డివైడర్ ను ఢీకొట్టుకుంటూ.. జనాలపైకి దూసుకొచ్చిన ట్రక్..

Untitled Design (1)

Untitled Design (1)

రోడ్డుపై వేగంగా వెళ్తున్న ట్రక్ డివైడర్ ను ఢీకొట్టుకుని జనాలపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పరగులు పెట్టారు. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ట్రక్కు రెయిలింగ్‌ను విరగ్గొట్టి, బైక్‌లను ఢీకొని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కొన్ని ప్రమాదాలు చూస్తే వణుకుపుట్టించేలా ఉంటాయి. వామ్మో.. జర్రుంటే సచ్చిపోతుండేరా అనే డైలాగ్‌ గుర్తుకు తెస్తాయి. అలాంటి యాక్సిడెంట్‌ తాజాగా చోటు చేసుకుంది. ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో చూస్తుంటే.. రోడ్డుకు అటువైపుగా వెళ్తున్న చావు.. నోరు తెరిచి మనపైకి దూసుకొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ఒక భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొంతమంది వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. రోడ్డు మీది నుంచి వెళ్తున్న ట్రక్ ఒక్కసారిగా డివైడర్ రెయిలింగ్ విరగొట్టుకుంటూ జనాలపైకి దూసుకొచ్చింది. ట్రక్కు మీదికి వస్తుందని గమనించిన ప్రజలు.. లగత్తెరో అజామ్ అనుకుంటూ పరుగులు పెట్టారు. రోడ్డు పక్కన ఆపి ఉన్న బైక్ లను ఢీకొడుతూ.. దుకాణాలలోకి దూసుకుపోయింది. దుకాణాలన్ని బాగా దెబ్బతిన్నాయి. వేగంగా వెళ్తున్న ట్రక్ డ్రైవర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై విధ్వంసం సృష్టించాడు. దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

Exit mobile version