Missing: ట్రాన్స్‌జెండర్ కనిపించకుండా పోయిన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ సైట్-3, బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ట్రాన్స్‌జెండర్ కల్యాణ్(35) మరి కొద్దిమంది సహచరులతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 12న తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా ఉప్పరపాలేనికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడకు రాలేదని సమాచారం రావడంతో అంతటా గాలించిన సహచరులు మంగళవారం ఉదయం ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్యాణ్ సహచరుడు వశీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. అసలేం జరిగింది?
ఇదిలా ఉంటే కల్యాణ్ తమ అందరి వద్దా అప్పు రూపేణా రూ.30లక్షల వరకు తీసుకుని పరారయ్యాడని అతని సహచరులు మరికొందరు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని విచారించి అవసరమైతే సెక్షన్లు మారుస్తామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
