Site icon NTV Telugu

Road Accident: తీవ్ర విషాదం.. ‘టెట్‌’ రాసేందుకు తండ్రి ఆటోలో వెళ్తున్న విద్యార్థినిని మింగేసిన రోడ్డు ప్రమాదం..

Road Accident

Road Accident

Road Accident: అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఆటోలో ప్రయాణిస్తూ కూతురు మృతి చెందింది.. టెట్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థిని సునీత అనకాపల్లి పట్టణ సుంకరమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.. అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్న టెట్ పరీక్ష రాసేందుకు NAD జంక్షన్ కు చెందిన బి.సునీత తండ్రి ఆటోలో ఇంటి నుంచి బయలుదేరింది. ఆటో అనకాపల్లి సుంకరమటి జంక్షన్ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో రోడ్డుపై తుళ్లిపడటంతో తలకు తీవ్ర గాయాలై టెట్ విద్యార్థిని సునీత అక్కడికక్కడే మృతి చెందింది,‌ కన్న కూతురు తండ్రి కళ్లముందే చనిపోవడంతో ఈ ఘటన అక్కడ ఉన్న అందర్నీ కలచవేసింది. ఈ ప్రమాదం నుంచి ఆటో డ్రైవర్ అయిన తండ్రి లక్ష్మణరావు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే.. ఆటో డ్రైవర్ అయిన తండ్రి లక్ష్మణరావు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మృతిచెందిన కుమార్తె సునీత మృతదేహాన్ని మరో వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సునీత కుటుంబాన్ని విషాదం ముంచెత్తగా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: Union Minister Pemmasani Chandrasekhar: ప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం కష్టం..

Exit mobile version