Site icon NTV Telugu

Andrapradesh : అన్నమయ్య జిల్లాలో విషాదం.. డీజీల్ ట్యాంకు శుభ్రం చేసేందుకు వెళ్లి ముగ్గురు మృతి..

Annamayya Dist

Annamayya Dist

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని పెట్రోల్ బంక్ లో డీజీల్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు.. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. సోమవారం నాడు ముగ్గురు కార్మికులు ట్యాంకును క్లీన్ చెయ్యడానికి అందులోకి దిగారు..ట్యాంకు ను క్లీన్ చేస్తున్న సమయంలో విషవాయువులు వెలువడటంతో ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు..

లోపలికి వెళ్లిన వాళ్ళు ఎంతసేపైనా రాకుంటే అగ్నిమాపక సిబ్బందికి బంక్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా కష్టపడి డీజీల్ ట్యాంకులో పడిపోయిన ముగ్గురిని బయటకు తీసుకు వచ్చారు. ఐదేళ్లుగా డీజీల్ ట్యాంకును శుభ్రపర్చలేదు. అయితే ఇవాళ శుభ్రపర్చేందుకు కార్మికులు దిగారు. అయితే డీజీల్ ట్యాంకులో విషవాయివులు వెలువడడంతో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు..

డీజీల్ ట్యాంక్ నుండి బయటకు తీసిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు..మృతి చెందినవారు హెచ్‌పీసీఎల్ కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించారు. అయితే ఆ ముగ్గురు ఒకే జిల్లాకు కడప జిల్లాకు చెందిన పెండ్లిమర్రికి చెందిన రవి, ఆనంద్ , సీకే దిన్నె కు చెందిన శివ లు గా గుర్తించారు.. వారి కుటుంబాలకు అధికారులు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించినట్లు సమాచారం..

Exit mobile version