Drunk And Drive Challans in Hyderabad: ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ‘భారత్’ ముందువరుసలో ఉంటుంది. రాష్ డ్రైవింగ్, సిగ్నల్స్ జంప్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటివి రోడ్డు ప్రమాదాలకు కారణాలు. ఇక మద్యం తాగి (డ్రంక్ అండ్ డ్రైవ్) వాహనాలు నడపడం ప్రధాన కారణం. దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నా.. ఇప్పటికీ చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లోదొరికితే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది.
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ అంటే రెండేళ్లు జైలు శిక్ష పడేంత పెద్ద నేరమా? అని కొందరు అనుకుంటుంటారు. నిజానికి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీ ప్రాణాలకే కాకుండా.. రోడ్డుపై నడిచే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే చిన్న విషయం కాదు. మనుషుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించిన నిబంధనలు రూపొందించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ప్రమాదకరం. మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున దీనికి దూరంగా ఉండాలి.
Also Read: Nokia G42 5G Smartphone Price: నోకియా నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ లీక్!
మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లే. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తొలిసారి పట్టుబడితే.. ఫైన్ వేస్తారు. మొదటిసారి 10,000 జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీరు 15,000 రూపాయల చలాన్ లేదా 2 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవచ్చు. ఒక్కోసారి రెండూ శిక్షలు వేసే అవకాశం కూడా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.
ఇది కాకుండా మరిన్ని నిబంధనలు కూడా అమలులో ఉన్నాయి. మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటారు వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5,000 చలాన్ విధిస్తారు. మరోవైపు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 2,000 లేదా 3 నెలల జైలు లేదా రెండూ విధిస్తారు. సిగ్నల్ జంపింగ్ చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఫైన్ ఉంటుంది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1,000 వరకు చలాన్ విధిస్తారు. ఇక సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపినందుకు రూ.1,000 చలాన్ విధిస్తారు.