Site icon NTV Telugu

Sad News : కారులో ఊపిరాడక మృతి చెందిన ముగ్గురు చిన్నారులు

Kids

Kids

తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. చైన్నైలోని తిరునల్వేలి పనకుడి పట్టణంలో ఓ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ కారులోకి ఎక్కారు. అయితే వారికి తెలియక కారు డోర్‌ లాక్ చేశారు. అయితే పిల్లలు ఆడుకుంటున్నారని దగ్గరలోనే ఉన్న గుడిలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లారు నాగరాజన్‌ కుటుంబ సభ్యులు.. గుడికి వెళ్లొచ్చిన నాగరాజన్‌ కుటుంబ సభ్యులు పిల్లల గురించి చూశారు. అయితే ఎంత వెతికిన ఇంట్లో కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లోని కారులో చూడగా.. ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు కారు అద్దాలు పగల గొట్టి చిన్నారులను బయటకు తీశారు. అయితే.. అప్పటికే జరగాల్సిన ఆనార్థం జరిగిపోయింది. నాగరాజన్‌ ఇద్దరు పిల్లలతో పాటు, స్నేహితుడి కుమారుడు సైతం ఆనంతలోకాలకు పయనమయ్యారు. దీంతో.. ఒక్కసారిగా నాగరాజన్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. స్థానికంగా ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

Exit mobile version