చత్తీస్ గఢ్ లో ఒక మొబైల్ దుకాణంలో యజమాని చేసిన ప్రమోషనల్ వీడియో చూసి చోరీకి తెగ బడ్డారు దొంగలు. అయితే అక్కడున్న నగదు ముట్టుకోకుండా.. కేవలం 25 లక్షల విలువైన ఫోన్లను మాత్రమే చోరీ చేశారు. దొంగతనానికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ నగరంలోని గుడ్డి బజార్‌లోని ఒక మొబైల్ దుకాణంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. దాదాపు 25 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను చోరీ చేశారు దొంగలు. అయితే చోరీకి ముందు దుకాణం యజమాని ఓ ప్రమోషనల్ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. వీడియోను చూసిన తర్వాత దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. వీడియో చూసిన తర్వాత, వారు దుకాణం లోపలి భాగం, స్టాక్ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత వారు రాత్రిపూట చోరీ చేశారు.
Read Also: Misbehave: యువతికి ముద్దు పెట్టిన ర్యాపిడో డ్రైవర్
దొంగలు దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. . కౌంటర్‌లోని నగదును ముట్టుకోలేదని.. కేవలం ఖరీదైన మొబైల్ ఫోన్‌లను మాత్రమే తీసుకెళ్లారని వెల్లడించారు. పోలీసులు ఈ విషయంపై అన్ని కోణాల నుండి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని చర్యలు తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
