Site icon NTV Telugu

Crime: గిరిజన మహిళపై BSF సైనికులు సామూహిక అత్యాచారం.. భద్రతా బలగాలపై నక్సలైట్ల ఆరోపణలు

Untitled 7

Untitled 7

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ లోని కాంకేర్ జిల్లాలో నక్సలైట్లు తమ ఉనికిని చాటుకుంటున్నారు. కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తు ఉన్న.. భారీగా భద్రత బలగాలను మోహరించిన నక్సలైట్ల ఉనికిని అడ్డుకోలేకపోతున్నారు అక్కడి అధికారలు. చివరికి నక్సలైట్లే భద్రత బలగాలపైనా ఆరోపణలు చేస్తూ కరపత్రాలని బహిరంగంగా విసిరారు. వివరాలలోకి వెళ్తే.. నక్సలైట్లు పెద్ద ఎత్తున కరపత్రాలను విసురుతూ భద్రతా బలగాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన కోయలిబెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలో చోటుచేసుకుంది. నక్సలైట్లు విడుదల చేసిన కారపత్రాలలో “కోయలిబెరా బ్లాక్‌లో పెరుగుతున్న పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గొంతు విప్పండి. జూలై 11, 2022న కుల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళపై ఇద్దరు BSF సైనికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అని పత్రం లో పేర్కొన్నారు.

Read also:CBSE Notification: సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

నక్సలైట్లు ఇలాంటి కరపత్రాలను విసిరేసిన తరుణంలో భద్రతా బలగాల పని తీరుపై మరోసారి విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపైన జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడలేదు. ఈ నేపథ్యంలో నక్సలైట్లు కరపత్రాన్ని విడుదల చేసి సైనికులపై నేరుగా ఆరోపణలు చేశారు. సాంఘీక మాధ్యమాల సమాచారం ప్రకారం నక్సలైట్లు ఈ కరపత్రాలని బుధవారం విసినట్లు తెలుస్తుంది. నక్సలైట్లు నిరంతరం వాళ్ళ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కోయలిబేరా బస్టాండ్ వద్ద నక్సలైట్లు భారీ సంఖ్యలో బ్యానర్లు కట్టారు. అలానే బస్సుల్లోనూ బ్యానర్లు అతికించారు. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకి గురైయ్యారు. కాగా భద్రత బలగాలు దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది.

Exit mobile version