సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ గౌడ్(42)అనామిక (40), కూతురు శ్రీ స్నిగ్ద (7) గా పోలీసులు గుర్తించారు. భార్య,కూతురుకు విషం ఇచ్చి.. తాను ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్. 10 ఏళ్ల కిందట ప్రేమ వివాహాం చేసుకున్నారు శ్రీకాంత్, అనామిక. శ్రీకాంత్ TCS కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు…అనామిక ఓ కార్పొరేటర్ స్కూల్ లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది.
వీరు బిరంగుడా వందనపూరి కాలనీలో నివాసం ఉంటున్నారు. గత రెండు రోజుల నుండి ఇంట్లో బయటికి రాని శ్రీకాంత్, అనామిక,స్నిగ్ధ.. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది. చనిపోయే ముందు దేవుడి ఫోటోలకు పూజ చేసి ఫొటలను బోర్లించి పెట్టినట్టు ఉన్న ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర మానసిక సమస్యలతో చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ కేసు వివరాలు తెలియాల్సి ఉంది.
