Site icon NTV Telugu

కట్టుకున్నవాడే కాలయముడై..

నేటి సమాజంలో ప్రాణానికి విలువలేకుండా పోయింది. అర్థంపర్థం లేని అనుమానాలతో మస్తిష్కంలో మంటలు పుట్టించుకోని.. వారి ఆలోచనలతో ఆ మంటలకు ఆజ్యం పోసుకుంటూ నమ్మివచ్చిన వారినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని కూకల్‌పల్లిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గూడ్స్‌ షెడ్‌ రోడ్డులో పుణ్యవతి, సంతోష్ అనే భార్యభర్తలు నివాసం ఉంటున్నారు.

అయితే ఈ ఏడాది మే నెలలో వీరికి వివాహం జరిగింది. వివాహం జరిగిననాటి నుంచి భార్య పుణ్యవతిపై భర్త సంతోష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో గత రాత్రి పుణ్యవతి గొంతునులిమి హత్యకు పాల్పడ్డాడు. రాత్రి నుంచి ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన పుణ్యవతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులను తెరిచి చూడగా అప్పటికే పుణ్యవతి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version