Site icon NTV Telugu

Maharastra: 25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ కమిషనర్

Untitled Design (7)

Untitled Design (7)

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ శాఖలో ఒక పెద్ద అవినీతి కేసు బయటపడింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఒక బిల్డర్ నుండి 25 లక్షలు లంచం తీసుకుంటుండగా ముంబై పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు

పూర్తి వివరాల్లోకి వెళితే.. . థానే మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణల నిరోధక విభాగం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శంకర్ పటోల్‌ను అవినీతి నిరోధక బ్యూరో (ACB) బుధవారం రూ25 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేసింది. అభిరాజ్ డెవలపర్స్ యజమాని అభిజిత్ కదమ్ నుంచి పటోలే డబ్బు డిమాండ్ చేశాడని అధికారులు తెలిపారు. అతను ఇప్పటికే రూ. 10 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు దారుడు తెలిపాడు. తన క్యాబిన్‌లో మరో రూ. 25 లక్షల నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు

Exit mobile version