కోటివిద్యలు కూటి కోసమే. అందుకే మనిషి రకరకాల పనులు చేస్తుంటాడు. కొందరు వాళ్ళ కుటుంబ పోషణకు ఊరు ధాటిపోతే మరి కొందరు దేశం దాటిపోతున్నారు. అలా దేశంకాని దేశం పోయినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి . ఏ చిన్న తప్పు జరిగిన కుటుంబ సభ్యులని ఆఖరి చూపు చూసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకి వెళ్లిన వాళ్ళు ఆచి తూచి అడుగెయ్యాలి. అలా కాకుండా విచక్షణ కోల్పోతే ఇలా ఏళ్ల తరబడి కుటుంబాలకి దూరం కావాల్సి వస్తుంది. ఓ తెలంగాణ వాసికి 17 సంవత్సరాల తర్వాత దుబాయి జైలు నుండి విముక్తి రాబోతుంది.
Read also:Suhana Khan: ట్రెడిషనల్ డ్రెస్ లో కింగ్ ఖాన్ కూతురు
వివరాలలోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రానికి చెందిన దండుగుల లక్ష్మణ్ మరియు సిరిసిల్ల జిల్లా పెద్దూరుకి చేందిన శివరాత్రి రవి,శివరాత్రి మల్లేష్, గొల్లెపు నాంపల్లి, శివరాత్రి హన్మంతు బ్రతుకు దెరువుకోసం దుబాయ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో నేపాల్ కి చెందిన సెక్యూరిటి గార్డు హత్య కేసులో 17 ఏళ్ళుగా దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా వీరి విడుదల కోసం మంత్రి కేటిఆర్ స్వయంగా భాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడారు. ఐదుగురి క్షమాభిక్ష కోసం షరియా చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు కి అయ్యే 15 లక్షలు చెల్లించారు. న్యాయవాది అభ్యర్థన మేరకు అనారోగ్యం ,వృద్ధాప్యం కారణాల దృష్ట్యా కల్పించే ఫరాజ్ కింద లక్ష్మణ్ విడుదలకు దుబాయ్ న్యాయస్థానం ఆమోదించింది. అయితే మిగిలిన నలుగురి విడుదలపైన ఇంకా స్పష్టత రాలేదు. అయితే మంత్రి కేటిఆర్ మిగిలిన నలుగురి విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు.