NTV Telugu Site icon

Telangana : ఛీ.. ఛీ.. వీళ్లు అస్సలు మనుషులేనా? తల్లి దండ్రులన్న కనికరం కూడా లేకుండా..

Telanganaa

Telanganaa

ఒకప్పుడు తల్లి దండ్రులను దైవంగా భావించి పూజించేవారు.. రాను రాను కనీసం మనుషుల మాదిరిగా కూడా చూడటం లేదు.. ఆస్తి ఇవ్వలేదనో లేక ఇంకేదో కారణాలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. కొందరు కొడితే.. మరికొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. కన్న తల్లి దండ్రులపై కనికరం లేకుండా తాళ్ళతో కట్టి దారుణానికి ఒడి గడుతున్నారు.. నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు సుపుత్రులు.ఇలాంటి కసాయి కొడుకుల చేతుల్లో తల్లిదండ్రులు బందీలయిన అమాను ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా లోని వేములవాడ పట్టణంలో నివాసముండే వృద్ద దంపతులను ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారు. ఆస్తి విషయమై తల్లిదండ్రులతో పాటు మేనల్లుడితోనూ వీళ్లు పలుమార్లు గొడవపడ్డారు. ఇలా నిన్న కూడా తల్లిదండ్రులతో గొడవకు దిగిన కొడుకులు అమానుషంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల కాళ్లు చేతులు కట్టేసి నడిరోడ్డుపై అవమానకరంగా కూర్చోబెట్టారు.. అందరు చూస్తున్నా ఎవ్వరు ఏమి చెయ్యలేకపోయారు..

ఇక తమ మేనల్లుడితో మరింత దారుణంగా వ్యవహరించారు. మేనల్లుడి కాళ్లుచేతులు తాళ్లతో బంధించి ఓ స్తంభానికి కట్టేసారు. ఈ వ్యవహారంపై గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.. అనంతరం అసలు ఏమి జరిగిందో తెలుసుకొని కొడుకులను మందలించి, ఇంకోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. అనంతరం వారికి కట్టిన తాళ్ళను తీశారు.. ఈ ఘటనకు సంబందించిన వీడియోను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..