తెలంగాణలో మరో ఘోర ప్రమాదం జరిగింది.. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు-కటాక్షాపూర్ మార్గం మధ్యలో కారును టిప్పర్ ఢీకొట్టడం తో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లో మృతి చెందారు… దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.. చనిపోయిన వారంతా సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతులు గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ సొసైటీ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు..
ఎదురుగా వేగంగా వస్తున్నా టిప్పర్ ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.. యాక్సిడెంట్ లో డ్రైవర్‌తో పాటు మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు..
ఉదయం కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగవాళ్లు ఉన్నారు. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు కాగా, తీవ్ర గాయాలపాలైన వారు కారులోనే ప్రాణాలు విడిచినట్లు ప్రమాదాన్ని చూసిన వాళ్ళు చెబుతున్నారు.. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. దైవ దర్శనానికి వెళ్లి ఇలా అందరిని ప్రమాదం పొట్టన పెట్టుకుందని బంధువుల రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. వారి రోదనలు చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు..