Site icon NTV Telugu

Tejeshwar Murder: తేజేశ్వర్ హత్యపై కొత్త ట్విస్ట్.. బయటపడిన కాల్ రికార్డులు..!

Audio

Audio

Tejeshwar Murder: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్‌ హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత సహా 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. పెళ్లికి ముందు మొదట నిశ్చితార్థం జరిగిన తరువాత ఇంటి నుంచి ఐశ్వర్య వెళ్లిపోయింది. ఆ సమయంలో ఐశ్వర్యను తిరుమలరావు తన ఇంటికి తీసుకెళ్లి ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తన భార్యను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ.. అందుకు తిరుమలరావు భార్య ఒప్పుకోలేదు. దీంతో తిరిగి ఇంటికి వచ్చింది ఐశ్వర్య. అయితే.. అప్పటికే ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే విషయం తెలిసిన తేజేశ్వర కుటుంబ సభ్యులు పెళ్లిని కాన్సిల్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిపెటాకులైన ఘట్టం నుంచి మళ్లీ పెళ్లి పీటలు ఎక్కించేందుకు ఐశ్వర్య ఆడిన డ్రామా, తేజేశ్వర్‌ను నమ్మించేందుకు ప్రేమవలపు.. చివరకు పెళ్లికి నాంది పలకేలా చేసింది. అయితే.. ఈ సమయంలో తేజేశ్వర్‌, ఐశ్వర్య మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఓ ఆడియో  ఒకటి బయటకు వచ్చింది.

 

Exit mobile version