Digital Arrest in Kadapa: కడప జిల్లా పోలీసులు మరో డిజిటల్ అరెస్టు కేసును ఛేదించారు. ఈ రెండో కేసు కూడా పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో చేయించడం, అందులోనూ మరో ఉపాధ్యాయుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. సిబిఐ అధికారులతో కేటుగాళ్ల బెదిరింపులకు తాళలేక మానసిక వేదనతో సదరు ఉపాధ్యాయుడు చనిపోవడం మరింత విషాదాన్ని కలిగిస్తోంది. మృతి చెందిన ఉపాధ్యాయుని కుమారుడు ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకున్నారు..
Read Also: Spiritual Township in Tirupati: తిరుపతిలో రూ.3వేల కోట్లతో.. 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్‌షిప్
ఇటీవల వేంపల్లికు చెందిన రిటైర్డ్ ఎమ్మార్వో వీరారెడ్డిని డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు 7 నెలలు వేధించి లక్షలాది రూపాయలు దోచుకున్న ముఠాను పోలీసులు చేశారు. ఈ ఘటన మరువక ముందే పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఉపాధ్యాయుడిని డిజిటల్ అరెస్ట్ చేసిన కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్ చేశారు. సిబిఐ అధికారుల నుండి బెదిరించి కోటి 60 లక్షల రూపాయలు దోచుకున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చెప్పారు. ఢిల్లీలో ఒక సామాన్య వ్యక్తితో కార్పొరేట్ బ్యాంకులో ఖాతా తీరిపించి బెదిరించి దోచుకున్న మొత్తాన్ని ఆఖాతాలోకి మళ్లించినట్లు గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 22 కేసులు సిబిఐ అధికారుల అంటూ డిజిటల్ అరెస్ట్ చూపించి బెదిరింపులు దిగారని, అరెస్టు అయిన వారిలో మధు అనే నిందితుడిపై హైదరాబాదులో డిజిటల్ అరెస్టు కేసులో అరెస్టు చేశారన్నారు. అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులనుంచి లక్ష 50 వేలు నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.. డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి ఈ సందర్భంగా కోరారు.. ఈ డిజిటల్ అరెస్టు వెనుక కొందరు విదేశాలున్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని.. లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు..
