NTV Telugu Site icon

Crime News: పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. పిల్లలు కలగడం లేదని..

Woman Commits Suicide

Woman Commits Suicide

Tamilnadu Woman Commits Suicide For Not Having Children: పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. తనకు పిల్లలు కలగడం లేదన్న ఆవేదనతో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నెట్టుకాడు గ్రామానికి చెందిన సౌందర్య(21) అనే యువతికి చెన్నవరం గ్రామానికి చెందిన గణేషన్‌తో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లైన కొత్తలో సౌందర్య ఎన్నో కలలు కంది. తన దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని, పిల్లలు పుడితే తల్లిగా వారిని పోషిస్తూ సంతోషంగా గడుపుదామని భావించింది. కానీ.. ఆమె మొదటి కోరిక తీరింది కానీ, రెండోదే పూర్తవ్వలేదు. పెళ్లయి రెండేళ్లయినా.. పిల్లలు కలగలేదని ఆమె ఆందోళన చెందింది. అత్తారింటోళ్లు కూడా ఆమెని పిల్లలు పుట్టడం లేదని సూటిపోటి మాట్లతో వేధించారు.

Sreeleela: అభిమానులకు షాక్.. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న శ్రీలీల

ఏం చేయాలో తెలీక సౌందర్య ఈనెల 13వ తేదీన తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనకు పిల్లలు లేకపోవడంతో, అందరి వద్ద మాటపడాల్సి వస్తోందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. అనంతరం ఫోన్ కట్ చేసి.. అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. సౌందర్య తల్లిదండ్రులకు అనుమానం వచ్చి, వెంటనే అత్తారింటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా.. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చిక్సిత కోసం చైన్నెలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అక్కడ సౌందర్య చిక్సిత పొందుతూ సోమవారం మృతి చెందింది. దీంతో కన్నీరుమున్నీరైన సౌందర్య తల్లిదండ్రులు.. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వాళ్లు కేసు నమోదు చేసి, దర్యాప్టు చేపట్టారు.