చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి తీవ్ర మనో వేధనకు గురయ్యాడు. భార్య మీద కోపంతో తన ముగ్గురు పిల్లలను దారుణాతి దారుణంగా హత్య చేసి… పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ లో జరిగింది.
Read Also: Uncles Murder Nephew: అల్లుడిని ఛాయ్ కి పిలిచి దారుణం.. ఏమైందంటే..
పూర్త వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని పట్టుక్కోట్టై తాలూకా గోపాలసముద్రం గ్రామానికి చెందిన నిందితుడు ఎస్ వినోద్ కుమార్ మదుక్కూర్ సమీపంలోని ఒక హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య నిత్య (35) దంపతులకు కుమార్తెలు వి ఓవియా (12), వి కీర్తి (8), కుమారుడు వి ఈశ్వరన్ (5) ఉన్నారు. అయితే తన భార్య వేరే ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భరించలేని భర్త వినోద్ ఆ కోపాన్ని తన పిల్లలపై చూపించాడు. ముగ్గురు బిడ్డలను అత్యంత పాశవికంగా హతమార్చాడు. తంజావూరులో ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు. తన భార్య మరొక వ్యక్తితో ఉన్న సంబంధంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు పిల్లల హత్య తంజావూరు ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
నిత్య సోషల్ మీడియా ద్వారా మన్నార్గుడికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఆరు నెలల క్రితం తన భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో.. ఆమె తన భర్త, పిల్లలను వదిలి ఆ వ్యక్తితో పారిపోయింది. దీంతో వినోద్ కుమార్ షాక్ కు గురయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే, అతను ఆమెను మర్చిపోలేకపోయాడు. కొన్ని రోజుల క్రితం ఆమెను కలిసి.. తనతో ఇంటికి రావాలని చెప్పడంతో ఆమె ఒప్పుకోలేదు.. దీంతో మద్యానికి బానిసైన వినోద్ ముగ్గురు పిల్లలను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
