Insurance Money: డబ్బుల కోసం స్నేహితుడినే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసేందుకు ఫ్రెండ్‌ని చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చోటు చేసుకుంది. చెన్నైలో తన పేరిట ఉన్న రూ.1 కోటి ఇన్సూరెన్స్ డబ్బును పొందేందుకు తాను మరణించినట్లుగా డ్రామా క్రియేట్ చేసి, తన పోలికలతో ఉన్న మరో వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరు నిందితుడితో సహా అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అయనవరం నివాసి సురేష్ హరికృష్ణన్ అనే వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు పొందేందుకు తన లాంటి ఒక వ్యక్తిని చంపేందుకు స్నేహితులతో కలిసి వెతకడం ప్రారంభించారు. సురేష్‌కి పదేళ్ల క్రితం పరిచయమున్న ఢిల్లీబాబు అనే వ్యక్తిని ఇందుకోసం ఎంచుకున్నారు. బాధితుడు కూడా అయనవరం వాసే. ప్లాన్ అమలు చేసేందుకు సురేష్, ఢిల్లీబాబు స్నేహం చేశాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న ముగ్గురు నిందితులు మద్యం సేవించేందుకు అని చెబుతూ ఢిల్లీబాబును పుదుచ్చేరి తీసుకెళ్లారు. ఢిల్లీబాబును చెంగల్పట్టు సమీపంలోని ఖాళీ ప్లాట్‌కి తీసుకెళ్లారు, అక్కడ అప్పటికే ఓ గుడిసె ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి మద్యం మత్తులో డిల్లీబాబుని సురేష్ గొంతుకోసి హత్య చేసి, గుడిసెకు నిప్పటించి అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు.
Read Also: Dr Saveera Parkash: “భారత్‌తో సంబంధాలు మెరుగుపరుస్తా”.. పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళా..
మరోవైపు ఢిల్లీబాబు తల్లి లీలావతి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే సెప్టెంబర్ 16న, గుడిసెలో కాలిపోయిన మృతదేహాన్ని సురేష్‌దిగా గుర్తించారు, ఆ మృతదేహానికి అతని సోదరి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే సురేష్ కనిపించకుండా పోయిన రోజునే తన కొడుకు ఢిల్లీబాబు కూడా బయటకు వెళ్లాడని, తన కొడుకుతో చివరిసారిగా మాట్లాడాడని లీలావతి పోలీసులకు చెప్పింది.
ఈ క్లూ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు, సురేష్ గ్రామానికి వెళ్లగా అతను మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. అయితే ఢిల్లీబాబు మృతికి చనిపోయాడని భావిస్తు్న్న సురేష్ కారమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. పోలీసులు వీరిద్దరి సెల్‌ఫోన్లను ట్రేస్ చేయగా, ఇద్దరి మొబైల్స్ గుడిసె దగ్గర యాక్టీవ్‌గా ఉన్నట్లు గుర్తించారు. కొందరు స్నేహితులను విచారించగా.. సురేష్ బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సురేష్, కీర్తి రాజన్ ఇద్దరూ ఢిల్లీబాబును హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను పోలీసులు సోమవారం జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.