NTV Telugu Site icon

తీరుమార్చుకోని తాలిబ‌న్లు… వారితో క‌లిసి ప‌నిచేశార‌ని…

2021 ఆగ‌స్ట్ 21నుంచి తాలిబ‌న్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అక్క‌డి ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ‌తంలో మాదిరిగా కాకుండా ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు క‌లిగించ‌బోమ‌ని, మ‌హిళ‌ల హ‌క్కులు కాపాడ‌తామ‌ని స్పష్టం చేశారు. కానీ చెప్పింది ఒక‌టి చేస్తున్న‌ది మ‌రొక‌టిగా మారింది. మ‌హిళ‌లకు ఎలాంటి హానీ త‌ల‌పెట్ట‌బోమ‌ని చెబుతూనే వారిని హింసిస్తున్నారు. మ‌హిళ‌ల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించి ఇంటికే ప‌రిమితం చేశారు. అంతేకాదు, గ‌తంలో మాజీ ప్ర‌భుత్వ స‌భ్యులు, మాజీ భ‌ద్ర‌తాద‌ళ స‌భ్యులు, అంత‌ర్జాతీయ భ‌ద్ర‌తా ద‌ళ స‌భ్యుల‌తో క‌లిసి ప‌ని చేసిన వారిలో సుమారు 100 మందిని తాలిబ‌న్లు చంపిన‌ట్లు ఐరాస ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో స్ప‌ష్టం చేశారు.

Read: ఎల‌క్ట్రిక్ వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌: బ్యాట‌రీల‌ను ఇలా మార్చుకోవ‌చ్చు…

ఇందులో మూటింట రెండొంతుల మందిని ఎలాంటి విచార‌ణ లేకుండా హ‌త్య‌చేసిన‌ట్లు త‌మ‌ద‌గ్గ‌ర ఆధారాలున్నాయ‌ని అన్నారు. త‌మ హ‌యాంలో అంద‌రికీ క్ష‌మాభిక్ష పెడ‌తామ‌ని చెప్పిన తాలిబ‌న్లు, అధికారం చేప‌ట్టిన త‌రువాత మాట‌త‌ప్పార‌ని ఆంటోనియో పేర్కొన్నారు. తాలిబ‌న్లు, ఐఎస్ ఉగ్ర‌వాదులు క‌లిపి 8 మంది పౌర‌హ‌క్కుల నేత‌ల‌ను పొట్ట‌నబెట్టుకున్నార‌ని, మ‌రో 10 మందిని బంధించార‌ని ఆంటోనియో పేర్కొన్నారు.