ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాలిబన్ల అకృత్యాలకు ఓ సంగీత విద్వాంసుడు తీవ్రంగా నష్టపోయాడు. తన జీవనోపాధిపై తాలిబన్లు దెబ్బకొట్టారు. సంగీత విద్వాంసుడి సంగీత వాయిద్యాన్ని అతని కళ్లముందే తగలబెట్టి ఎంజాయ్ చేశారు. పాపం ఆ సంగీత విద్వాంసుడు కంటతడి పెట్టుకుంటే అతనిని చూసి తాలిబన్లు పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తూ దారుణానికి ఒడిగట్టారు. చుట్టు ప్రజలు చేరి చోద్యం చూస్తున్నారు తప్పించి ఇదేంటని ఎవరూ ప్రశ్నించలేదు. తాము ప్రజల్లో గొప్ప మార్పును తీసుకొస్తామని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు రోజుకో విధంగా అక్కడి ప్రజలకు నరకం చూపిస్తున్నారు.
Read: కీలక నిర్ణయం: ఆంక్షలను ఫాలో అవ్వం… కోవిడ్‌తో కలిసి బతికేస్తాం…
ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా దారుణంగా లాస్ అయింది. ఉద్యోగాలు లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఆకలి తీర్చేందుకు బహిరంగ మార్కెట్లో కిడ్నీలను అమ్ముకుంటున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి విస్తరిస్తుంటే, దాని గురించి అక్కడి తాలిబన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ఇప్పటికే విఫలం అయింది. ప్రజలు భయం భయంతో కాలం వెల్లబుచ్చుతున్నారు. ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారు.
