Site icon NTV Telugu

Suspicious Death: వివాహిత అనుమానాస్పద మృతి.. తిరువూరులో ఉద్రిక్తత..

Crime

Crime

Suspicious Death: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది.. మొన్న ఏ కొండూరు గ్రామానికి చెందిన వెంపాటి మధుమిత (22) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలారు.. మృతురాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉండేది.. మృతురాలు మధుమిత అమ్మమ్మ గారి ఊరు తెల్లదేవరపల్లి గ్రామం కాగా.. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బోల్లిపోగు ప్రతాప్ అనే వ్యక్తి తమ కూతురిని తీసుకెళ్లి చంపి ఉరి వేసినాడు అని ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు వెంపాటి పాపారావు, లావణ్య.. దీంతో, ప్రతాప్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు..

Read Also: Vizag Crime: దువ్వాడ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. ఇక, భీమిలి హత్య కేసులో సంచలన అంశాలు..!

అయితే, ప్రతాప్‌పై సరైన సెక్షన్స్‌ నమోదు చేయకుండా కేసు పెట్టారని.. ప్రతాప్ పై మర్డర్ కేసు నమోదు చేయాలంటూ తిరువూరు ప్రధాన రహదారిలో ఆందోళనకు దిగారు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు.. మధుమితకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు.. దీంతో.. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.. న్యాయం చేసేవరకు కదిలేదు లేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మధుమిత కుటుంబ సభ్యులు, బంధువులు.. అయితే, రోడ్డుపై బైఠాయించిన వారిని లాగేశారు పోలీసులు, ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది.. ఇక, మధుమిత కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్ కి తరలించారు పోలీసులు.. మరోవైపు.. చనిపోవడానికి మధుమిత సెల్ఫీ వీడియో తీసుకోవడం.. అది బయటకు వచ్చింది.. నన్ను మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు.. నా వళ్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు అంటూ.. సెల్ఫీ వీడియోలో పేర్కొంది మృతురాలు..

Exit mobile version