Central Government: భర్తను భార్య రేప్ చేయడమేంటి.. భార్యను భర్త రేప్ చేయడమేంటి.. అసలు ఏంటి ఇదంతా.. సమాజం ఎటువెళ్తోంది.. టైటిల్ చూడగానే ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఇవే అనుమానాలు వ్యతమవుతున్నాయి. ఒక మహిళకు ఇష్టం లేకుండా ఏ మగాడు.. ఆఖరికి భర్త కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. ఇది అందరికి తెల్సిందే..ఎందుకంటే ఒక మహిళగా ఆమె హక్కులను పొందడానికి కానీ, వద్దు అని ఆపడానికి కానీ ఆమెకే హక్కు ఉంటుంది. ఈ విషయమై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఆడదానికి నచ్చకుండా భర్త సైతం శృంగారం చేస్తే.. అది రేప్ కిందనే పరిగణిస్తామని, అందుకు భర్తకు శిక్షపడుతోందని చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయమై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. భార్యను భర్త రేప్ చేస్తే నేరం.. మరి భర్తను భార్య రేప్ చేస్తే..? అని కొందరు ప్రశ్నించారు. ఇక వారు అడిగినదాంట్లో కూడా తప్పులేదని కోర్టు నమ్ముతోంది. దీంతో భర్తకు ఇష్టం లేకుండా భార్య శృంగారం చేస్తే నేరంగా పరిగణించాలా..? వద్దా అన్న విషయాన్ని తేల్చాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా దీనిపై స్పందించాలని కోరింది.
ఇక ఈ కేసు ఎక్కడ మొదలయ్యింది..అంటే.. కేరళలో ఒక భార్య.. తన భర్త తనపై ఇష్టం లేకుండా శృంగారం చేసినట్లు కేసు పెట్టింది. దీనికి కోర్టు ఐపీసీలోని సెక్షన్ 375 ప్రకారం.. మైనర్ కాని భార్యతో భర్త శృంగారం జరపడం నేరం కాదు అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ సెక్షన్ ను పలువురు తప్పుపట్టారు. లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని హరించేలా ఈ సెక్షన్ ఉందని, వెంటనే దీన్ని మార్చాలని కొందరు డిమాండ్ చేశారు. ఈ మధ్యనే భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేసే భర్తను నేరస్థుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. ఇక ఈ తీర్పుతో పైన ఉన్న అనుమానం రేకెత్తింది. భార్యకు ఒక తీర్పు.. భర్తకు మరొక తీర్పా..? భార్యను భర్త రేప్ చేస్తే నేరం.. మరి భర్తను భార్య రేప్ చేస్తే..?.. చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.