NTV Telugu Site icon

Crime: రోడ్డు పక్కన సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం..

Crime

Crime

Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హాపూర్ జిల్లాలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ రోజు ఎర్రటి సూట్‌కేస్‌ కనిపించింది. అనుమానం రావడంతో సూట్‌కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళ డెడ్‌బాడీ ఉంది. ముందుగా ఈ సూట్‌కేస్‌ని రోడ్డుపై ప్రయాణికులు గమనించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Karnataka: తల్లికూతుళ్లు వ్యభిచారం చేస్తున్నారని.. బయటకీడ్చి కొట్టారు..

మహిళ శరీరం మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి. గాయాలతో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వయసు 25 -30 మధ్య ఉంటుందని భావిస్తు్న్నారు. ప్రాథమిక నివేదిక అందిన వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాల కోసం అన్ని వివరాలను సేకరించారు. సూట్‌కేస్‌లో యువతి మృతదేహంతో పాటు మరికొన్ని వస్తువులు కూడా దొరికాయి.

ఏఎస్‌పీ వినీత్ భట్నాగర్ మాట్లాడుతూ.. మహిళ గాయాలను బట్టి చూస్తే సుమారు ఒక రోజు ముందు మరణించి ఉండొచ్చని తెలుస్తోందని చెప్పారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళ హత్యకు దారి తీసిన పరిస్థితులను నిర్ధారించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

Show comments