Site icon NTV Telugu

School Violence: టీచర్‌ను పొట్టు పొట్టు కొట్టిన పేరేంట్స్..

Bihar

Bihar

School Violence: బీహార్‌లోని గయా జిల్లాలో తమ కొడుకును కొట్టిన టీచర్‌పై విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన తాజాగా బయటకు వచ్చింది. ఆ విద్యార్థి పేరెంట్స్ స్కూల్ కి వచ్చి ఉపాధ్యాయుడిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. అయితే, వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతిలో ఇద్దరు పిల్లలు కొట్టు కోవడంతో రాకేష్ అనే టీచర్ వారిని ఆపి ఇరువురిని చెంప దెబ్బలు కొట్టారు.

Read Also: CJI BR Gavai: ‘‘మరాఠీ’’ మీడియంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..

అయితే, అందులో ఒక స్టూడెంట్ తనను టీచర్ కొట్టిన విషయం పేరేంట్స్ కు ఫిర్యాదు చేయడంతో.. వారు కోపంతో క్షణాల్లోనే పాఠశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రాకేష్ పై పిడిగుద్దులు, చెంప దెబ్బలతో రెచ్చిపోయి దాడి చేశారు. అంతటితో ఆగకుండా కర్రలతో కూడా అతడ్ని తీవ్రంగా కొట్టారు. వారిని అడ్డుకోబోయిన మరో టీచర్ పై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ భయంతో క్లాస్ రూమ్‌లోకి వెళ్లి దాకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. గాయపడిన సదరు ఉపాధ్యాయులు రాకేష్ రంజన్, ధర్మేంద్ర కుమార్‌లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version