NTV Telugu Site icon

Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..

Warangal Crime

Warangal Crime

Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది.

Read also: AP Rains: మరో 3 రోజులు ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలో భారీవర్షాలు

వరంగల్ నగరంలోని ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో శ్రీదేవి (16) అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటుంది. ఏకశిలా గర్ల్స్ హాస్టల్ లోనే శ్రీదేవి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి శ్రీదేవి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీదేవి ఎంత సేపటికి గది తలుపులు తెరవక పోవడంతో రూమ్మేట్స్ ఏకశిలా గర్ల్స్ హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం గది తలుపులు తెరిచి చూడగా శ్రీదేవి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే శ్రీదేవిని కిందికి దించగా అప్పటికే మృతిచెందింది. దీంతో యాజమాన్యం శ్రీదేవి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే శ్రీదేవి మృతి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో హాస్టల్‌ వద్దకు వచ్చి యజమాన్యానికి నిలదీశారు.

Read also: IND vs AUS: ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను: రోహిత్‌ శర్మ

దీంతో యాజమాన్యం పొంతలేని సమాధానం చెప్పారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. యాజమాన్యానికి పోలీసులు ప్రశ్నించగా అనారోగ్యమే కారణంగా శ్రీదేవి చనిపోయిందని తెలిపారు. దీంతో బంధువులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంగా చనిపోతే తమ కూతురు ఉరి ఎందుకు వేసుకుందని? అసలు చనిపోయన సమాచారం కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. దీంతో ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీదేవి మృతికి కారణం ఏకశిలా గర్ల్స్ హాస్టల్ సిబ్బందే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం లేకుండా మృత దేహాన్ని మార్చురీకి ఎందుకు తరలించారని, న్యాయం జరిగేంత వరకు ఏకశిలా గర్ల్స్ హాస్టల్ వద్ద నుంచి కదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suriya : సూర్య కల్ట్ టైటిల్ రివీల్ చేసేందుకు టైం ఫిక్స్

Show comments