పండుగలకు విందుభోజనం చేయడం మాములే.. అయితే విందుభోజనం కోసం మేక మాంసమో లేక చికెన్‌ను కొనుగోలు చేయాలి.. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మేకలు దొంగతనం చేసి సంక్రాంతి విందుభోజనం చేద్దామనుకున్నారు. కానీ చివరికి మేకలు ట్విస్ట్ ఇవ్వడంతో జైలు పాలయ్యాడు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మేకల గుంపులోని మేకను దొంగతనం చేసేందుకు ఇద్దరు రాత్రి వెళ్లారు.
మేక గుంపులోకి వెళ్లారు తీరా మేకను దొంగతనం చేద్దామనుకొని మేకను పట్టుకునే సరికి అదికాస్త అరవడం మొదలు పెట్టింది. దీంతో ఆ మేకను దొంగ చంపేశాడు. ఇది చూసిన మిగితా మేకలు కూడా అరవడంతో మేకల గుంపు వద్దకు యజమానులు వచ్చారు. యాజమానుల రాకను గమనించి దొంగల్లో ఓ వ్యక్తి తప్పించుకోని పారిపోగా ఒక దొంగ మాత్రం యజమానులకు చిక్కాడు. దీంతో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
