హైదరాబాద్ నడిబొడ్డు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం కలిగించింది. ఈ ఎస్ ఐ ఆసుపత్రి లైన్ నుండి వస్తున్న వెర్ణా కారు దూసుకుపోయింది. మొదట ఓ స్కూటీని ఢీ కొట్టి అదే వేగంతో మరో బైక్ ను ఢీ కొట్టింది కారు. బీకే గూడ చౌరస్తా దగ్గర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 8 నెలల పసికందుకి గాయాలయ్యాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు కారును సీజ్ చేసారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. కారు డ్రైవర్ ను అరెస్ట్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంంతో ఆ ప్రాంతంలో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు.
