Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 130కి.మీ వేగంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపైకి దూసుకెళ్లిన కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: తమిళనాడులోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను 130 కిలోమీటర్ల వేగంతో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్‌లో తిరుపతికి చెందిన ఎస్.లావణ్య(23), కేరళకు చెందిన లక్ష్మి(24) అనలిస్టులుగా పనిచేస్తున్నారు. ఈ ఐటీ కారిడార్‌లో కంపెనీలు అధికంగా ఉండటం వల్ల రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో లావణ్య, లక్ష్మి బుధవారం రాత్రి 11.30గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్ వద్ద అటుగా వస్తున్న కారు అదుపుతప్పి వారికిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
Rajasthan: 200 అడుగుల బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి..
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్‌వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
కారు అదుపుతప్పడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మోహిత్‌కుమార్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. రద్దీగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌లు లేకపోవడంతో పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ మధ్యలో రోడ్లు దాటడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిగ్నల్ సేఫ్టీతో జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని, పాదచారులకు ఓవర్‌హెడ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!