NTV Telugu Site icon

Tomato Curry Crime: మహిళ ప్రాణం మీదకు తెచ్చిన ‘టమాట కూర’

Tomato Curry Issue

Tomato Curry Issue

Son Beaten His Mother Over Tomato Curry Issue In Mahabubabad: ఒక కుటుంబంలో టమాట కూర చిచ్చురేపింది. అత్తాకోడళ్ల మధ్య గొడవకు కారణం అయ్యింది. అంతటితో వ్యవహారం ఆగలేదు.. కొడుకు మధ్యలో దూరడంతో మరింత ముదిరింది. తన సొంత తల్లి అని కూడా చూడకుండా ఆ కర్కశుడు దాడి చేశాడు. పాపం.. ఈ దాడిలో ఆ తల్లి తీవ్ర గాయాలపాలైంది. ఈ దారుణమైన గటన మహబూబాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వేళ్తే.. బుజ్జి అనే మహిళ తన కొడుకు మహేందర్, కోడలు నందినితో కలిసి వేంనూరులో ఉంటోంది. భోజనం చేసేందుకు కోడలు నందిని టమాట కూర చేసింది. అది తిన్న అత్త బుజ్జి.. కూర బాగలేదని కోడలిని మందలించింది. ఇంకోసారి అలా చేయొద్దని, రుచికరంగా చేయాలని సూచించింది.

Tragedy: విచిత్రం వారు కవలలు.. ఒకరు చనిపోగానే 900కి.మీ. దూరంలోని అతనూ చనిపోయాడు

అత్త చెప్పిన మాటల్ని మనసుకు తీసుకున్న నందిని.. భర్త మహేందర్ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారం చెప్పింది. ‘కూర విషయంలో నీ తల్లి నన్ను అవమానించిందంటూ’ ముసలి కన్నీరు పెట్టుకుంది. అది చూసి కరిగిపోయిన భర్త.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ఆ ఆవేశంతోనే తల్లి వద్దకు వెళ్లి, నా భార్యనే అవమానిస్తావా అంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే సొంత తల్లిపైనే మటన్ కొట్టే కత్తితో దాడి చేశాడు. నేను నీ తల్లినని, అలా కొట్టొద్దని ఆమె వేడుకుంటున్నా.. కొడుకు కనికరించలేదు. ఈ దాడిలో బుజ్జి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న బంధువులు.. పోలీసులకు మహేందర్, నందినిలపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం కూర బాగలేదన్న పాపానికి, భార్య కోసం కన్న కొడుకే ఈ దారుణానికి ఒడిగటడ్డం నిజంగా సిగ్గుచేటు.

Bank Robbery: బ్యాంక్ అధికారే దొంగైన వేళ.. 19 కోట్లు స్వాహా

Show comments