Software Employee: హైదరాబాద్ మియాపూర్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.
Read also: Mulugu Agency: ములుగు ఏజెన్సీలో చలి పంజా.. కమ్మేసిన పొగ మంచు..
మనోజ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి నాగలక్ష్మితో 5 నెలల క్రితమే వివాహం అయ్యింది. నాగలక్ష్మి ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. అయితే వివాహం జరిగిన కొద్దిరోజుల్లోనే నాగలక్ష్మికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్యలో రోజూ ఏదో ఒక గొడవ జరగుతూ వస్తుంది. అయితే భర్త వేధింపులు, మనస్పర్థలు కారణంగా నాగలక్ష్మి విసిగిపోయింది. అటు పుట్టింటి వారికి, ఇటు అత్తింటి వారికి తన బాధ చెప్పలేక కుంగిపోయింది. చివరకు చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆన్లైన్ లో విష పదార్థాలు ఆర్డర్ చేసింది.
Read also: Hyderabad Crime: బేగంబజార్‌లో జంట హత్యలు.. ఘటనపై క్లారిటీ ఇచ్చిన అబిడ్స్ ఎసీపీ..
విష పదార్థాలు రాగానే వాటిని తాగి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త మనోజ్ వేధించడం వలనే తన కూతురు నాగలక్ష్మి చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ద్వారా విష పదార్థాలు పెట్టడం ఏంటని? కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న నాగలక్ష్మి భర్త మనోజ్ పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగలక్ష్మి విష పదార్థాలు ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్‌లో ఏది పెట్టింది? ఆన్‌లైన్ లో విషపదార్థాలు ఎవరు సప్లై చేస్తు్న్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఇలా ఆన్‌లైన్ ద్వారా విషపదార్థాలు సప్లై చేస్తారని నాగలక్ష్మికి ఎవరు చెప్పారు? అనే దానిపై కూడా కూపీ లాగుతున్నారు.
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి.. క్యాబినెట్ విస్తరణపై హై కమాండ్‌తో భేటీ..