Site icon NTV Telugu

Vizag: ఇన్‌స్టా‌గ్రామ్‌లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…

Sam (4)

Sam (4)

సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలు, వీడియోలు పెట్టడం చాలా వరకు సేఫ్ కాదని పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ పెట్టిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మన ప్రొఫైళ్స్ ఇతరుల ఆదీనంలోకి వెళ్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని.. కొందరు కేటుగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలు, వీడియోలు పెట్టడం ఎంతవరకు సేఫ్.. అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా.. ఇది మాత్రం అస్సలు మంచిది కాదంటూ పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నా.. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల.. ముఖ్యంగా మహిళలు, యువతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విశాఖకు చెందిన ఓ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ స్టేటస్ పెట్టుకుంది. అప్పుడప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండేది. అయితే ఓ రోజు.. ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.. ఎందుకంటే అందులో ఉన్నది తన ఫోటో.. అది కూడా చూడని విధంగా అశ్లీలంగా ఉంది..

దీంతో షాక్‌లోకి వెళ్లిపోయిన ఆ మహిళకు.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో మరో మెసేజ్ వచ్చింది.. చెప్పినట్టు వినకపోతే ఇలాంటి ఫోటోలు అందరికీ షేర్ చేస్తానని బెదిరింపు మెసేలు వచ్చాయి. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి ఓ యువకుడు.. యువతి ఫోటోను అశ్లీలంగా మార్ఫ్ చేసినట్టు గుర్తించారు. బాధితురాలు ఇంస్టాగ్రామ్ కి అశ్లీల ఫోటోలను పంపిన యువకుడిని నంద్యాల జిల్లాకు చెందిన గురునాథ్ గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version